CM KCR : ప్రైవేటు టీచర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్.. నెలకు 2 వేలు, 25 కిలోల బియ్యం

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… తెలంగాణలోని ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే వాళ్లందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్స్, ఇతర సిబ్బంది అందరికీ ప్రతి నెల 2 వేల రూపాయల నగదు, 25 కిలోల బియ్యాన్ని అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దాని వల్ల విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఎలాగూ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. కానీ.. మూత పడ్డ ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే వాళ్లకు ఆయా యాజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే సిబ్బంది, టీచర్లకు ఆర్థికంగా వస్తున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

cm kcr to assist financially to private schools teachers
cm kcr to assist financially to private schools teachers

దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఒక లక్షా 45 వేల మంది ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రతి ఊరులోని రేషన్ షాపు ద్వారా రెండు వేల రూపాయల నగదు, 25 కిలోల ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం అందించనుంది.

దీనికి సంబంధించి లబ్ధిదారులయిన ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బంది… వెంటనే తమ బ్యాంకు అకౌంటు వివరాలు, స్కూల్ తదితర వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement