CM KCR : బ్రేకింగ్ న్యూస్ : ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్?

CM KCR : కరోనా వైరస్ సోకటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆసుపత్రికి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. జనరల్, రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కి వెళ్లనున్నారని అంటున్నారు. ఆయనకి సీటీ స్కాన్ కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మెడికల్ టెస్టుల తర్వాత కూడా కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లోనే ట్రీట్మెంట్ పొందుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెండు టెస్టుల్లోనూ..

కరోనాకి సంబంధించిన స్వల్ప లక్షణాలు కనిపించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తొలిసారిగా మొన్న సోమవారం ర్యాపిడ్ టెస్టు (యాంటీ జెన్ పరీక్ష) చేయటంతో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అదే రోజు అధికారికంగా ధ్రువీకరించారు. అనంతరం డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేశారు. దాని ఫలితం నిన్న మంగళవారం వచ్చింది. అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కొవిడ్-19 నిర్థారణ అయింది. దీంతో వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఆయన తన అగ్రికల్చరల్ ఫాం హౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షిస్తున్నారు.

CM KCR : telangana cm kcr will visit a private hospital for regular tests
CM KCR : telangana cm kcr will visit a private hospital for regular tests

ప్రపంచవ్యాప్తంగా: CM KCR

టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా అయిన కేసీఆర్ నాగార్జునసాగర్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారం కోసం ఈ నెల 14న అంటే గత బుధవారం హాలియాలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ పలువురిని ప్రత్యక్షంగా కలిశారు. తర్వాత రెండు మూడు రోజులు బాగానే ఉన్నారు. కానీ మొన్న సోమవారం నుంచి జ్వరం, జలుబుతో ఇబ్బందిపడుతున్నారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కోరుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ విషయమై వాకబు చేశారు. సినీ ప్రముఖలు పలువురు కేసీఆర్ కరోనాని జయిస్తారని ఆకాంక్షించారు.

Advertisement