CM KCR: చాలా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కే‌సి‌ఆర్, అక్కడున్నవాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెన్స్!

kcr
kcr

CM KCR అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూసినా చాలు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత షార్ప్ గా ఉంటారో చెప్పే సంఘటన ఒకటి మొన్న చోటుచేసుకుంది. సహజంగా ఆయన ఏదైనా అంశం పైన సమీక్ష ఏర్పాటు చేశారంటే అది కనీసం నాలుగైదు గంటలపాటు కొనసాగుతుంది. అలాంటి కేసీఆర్ రెండు రోజుల కిందట సెక్రటేరియట్ నిర్మాణ పనుల పరిశీలనను కేవలం అర్ధ గంటలోనే ముగించేశారు. దీన్నిబట్టి అక్కడి వ్యవహారం ఆయనకు ఎంత వేగంగా అర్థమైపోయిందని చెప్పొచ్చు.

రిపబ్లిక్ డే నాడు..CM KCR
సీఎం కేసీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ నిర్మాణాన్ని మంగళవారం రిపబ్లిక్ డే నాడు స్వయంగా వెళ్లి చూశారు. సైట్ వద్దకు చెప్పిన టయానికి ఠంఛనుగా వెళ్లారు. కన్ స్ట్రక్షన్ ప్లాన్ కాపీని చూస్తూ అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అనుకున్నవి అనుకున్నట్లుగా భవనాల నిర్మాణాలు సాగుతున్నాయా లేదా అనేది చెక్ చేశారు. కానీ.. వాటి పట్ల ఆయన ఏమాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో అక్కడున్న ఆఫీసర్ల పైన, కాంట్రాక్టర్ల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జరిమానా?..

తెలంగాణ నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి 2019 జూన్ 26న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెగ్యులర్ పనులు ఏడాదికి పైగా ఆలస్యంగా అంటే 2020 నవంబర్ 6న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఏడాది లోపు వాటిని పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి 2021 జనవరి 26న పరిశీలన చేశారు. ఈ ప్రాజెక్టును షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పనులు అనుకున్నంత వేగంగా సాగట్లేదని కేసీఆర్ గుర్తించారు. డెడ్ లైన్ కల్లా పూర్తి కావాల్సిందేనని తేల్చిచెప్పారు. లేకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

అచ్చుగుద్దినట్లు..
ప్రపోజల్స్ లో చెప్పిన బిల్డింగులను చెప్పినట్లు నిర్మించాలని, ఎక్కడా చిన్న మార్పు కూడా చేయకూడదని సీఎం కేసీఆర్ సూచించారు. పనులు లేటవటానికి దారితీసిన కారణాలను నిర్మాణదారులు చెప్పగా అవి ఆయనకు నచ్చలేదు. పునాదులు తీసేటప్పుడు పెద్ద బండ రాళ్లు అడ్డంగా ఉండటంతో పనులు ఆలస్యమయ్యాయనగా అలాంటి సాకులు చెప్పొద్దంటూ తోసిపుచ్చారు. ఉన్నది అర్ధ గంటసేపే అయినా కేసీఆర్ దడదడలాడించారని, దీంతో అక్కడున్నోళ్లంతా పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించారని సమాచారం.

Advertisement