CM KCR : కేసీఆర్ చేతిలో లంచాలు తీసుకుంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేల జాబితా

NQ Staff - April 27, 2023 / 07:58 PM IST

CM KCR  : కేసీఆర్ చేతిలో లంచాలు తీసుకుంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేల జాబితా

CM KCR  : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మరియు నాయకులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. కొంత మొత్తం డబ్బులు లంచంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనే విషయం తన వద్ద సమాచారం ఉందని ఎమ్మెల్యేలు తీసుకున్న లంచం కి సంబంధించి జాబితా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని.. ఇక ముందు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

ఇక పార్టీలో కొందరు నేతల మధ్య విభేదాలు తలెత్తడం పై కూడా ఆయన తీవ్రంగా స్పందించాడు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని ఎలాంటి సమస్యలు ఉన్న అధిష్టానం వద్ద చెప్పుకొని పరిష్కరించుకోవాలని కేసీఆర్ సూచించారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us