నటుడు జయప్రకాష్ రెడ్డికి సీఎం కెసిఆర్ సంతాపం

Advertisement

ప్రముఖ సీనియర్ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గుంటూరులోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే జయప్రకాష్ అకాల మరణానికి ప్రేక్షక లోకం విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన గుండెపోటుతో బాత్ రూమ్ లో కుప్పకూలిపోయి మృతి చెందారు. ఇక జయప్రకాష్ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జయప్రకాష్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ ఇండస్ట్రీలో విభిన్న పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించాడని అన్నాడు. గొప్ప రంగస్ధల నటుడిగా జయప్రకాశ్‌రెడ్డికి ప్రజలలో పెద్దఎత్తున అభిమానం ఉందని కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here