శ్రీశైలం ప్రమాదం పై సిఐడి విచారణ : సీఎం కెసిఆర్

Admin - August 21, 2020 / 11:50 AM IST

శ్రీశైలం ప్రమాదం పై సిఐడి విచారణ : సీఎం కెసిఆర్

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటికే తొమ్మిది మంది చిక్కుకున్నారు అని అధికారులు వెల్లడించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా దాంట్లో ఆరుగురి మృతి దేహాలు బయటపడ్డాయి. అయితే ఇంకా ముగ్గురు వ్యక్తులు దొరకాల్సి ఉంది. ఈ ఘటన పై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రమాదం పై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరం అని అన్నాడు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అలాగే ఈ ఘటనలో మరణించిన వారికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నాడు. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us