గవర్నర్ తమిళి సై తో సీఎం కెసిఆర్ భేటీ

Advertisement

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో తెలంగాణ సీఎం కెసిఆర్ భక్తి అయ్యారు. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్‌ పరామర్శించారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీ నుండి 20 రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గత బడ్జెట్ సమావేశాలను కరోనా వైరస్ వల్ల సగంలోనే ముగింపు చేసారు. ఇక ఈ సమయంలో చర్చకు రానీ బిల్లులు, అలాగే ఆమోదం చేసిన బిల్లులు ఈసారి అసెంబ్లీ సభలో ప్రవేశ పెట్టనున్నారు.

ఇక జరుగబోయే సమావేశాలను కరోనా వల్ల నియమ నిబంధనల వలన నిర్వహించనున్నారు. అలాగే సభలో సభ్యులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి ఈ భేటీ లో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి తెలియజేశారు. అలాగే మాజీ ప్రధానమంత్రి పీవి నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here