CM KCR : కేసీఆర్ ఆ వర్గాన్ని.. కేటీఆర్ ఈ వర్గాన్ని.. ఆకట్టుకునేలా హామీలు..!

NQ Staff - November 27, 2023 / 10:45 AM IST

CM KCR : కేసీఆర్ ఆ వర్గాన్ని.. కేటీఆర్ ఈ వర్గాన్ని.. ఆకట్టుకునేలా హామీలు..!

CM KCR :

తెలంగాణలో ప్రధానంగా కనిపించేవి రైతు కుటుంబాలు. అందులో ఎలాంటి అనుమనాలు లేవు. దాని తర్వాత ఉద్యోగులు, యువత కనిపిస్తారు. అయితే కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతుల కోసం ఎంత చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రైతుబంధు, ఉచిత కరెంట్, 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతు బీమా లాంటి పథకాలు తీసుకువచ్చారు. దాంతో పాటు ఇంకా అనేక రకాల సదుపాయాలను వారికి కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రధానంగా రైతాంగాన్ని ఆకట్టుకునే విధంగానే హామీలు గుప్పిస్తున్నారు.

రైతుల కోసం ఏం చేశామో.. ఇంకా ఏం చేస్తామో చెబుతున్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధును రూ.15వేల వరకు పెంచుతామని చెబుతున్నారు. అంతే కాకుండా పింఛన్లు కూడా పెంచుతామని ఏకంగా మేనిఫెస్టోలో పెట్టేశారు సీఎం కేసీఆర్. ఒక రకంగా ఇది సాహసం అనే చెప్పుకోవాలి. అంతగా రైతుబంధు ఇవ్వడం, పింఛన్లు ఇవ్వడం అంటే మాటలు కాదు. అయినా సరే సీఎం ముందుడుగు వేశారు. అది చాలా ధైర్యంతో కూడుకున్నది. కేసీఆర్ హామీలతో ఆ రెండు వర్గాల ఓట్లర్లు బీఆర్ ఎస్ ఖాతాలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు యువతలో ఎంతో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమే.

దాన్ని భర్తీ చేయడం కోసం స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. అందుకే ఆయన మొన్న నిరుద్యోగులతో చిట్ చాట్ నిర్వహించి వారిలో ఉన్న అనుమానాలు తొలించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం రాగానే అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్వయంగా హామీలు గుప్పించి.. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అందుకే ఆయన మాటలు ఇప్పుడు నిరుద్యోగులు కూడా నమ్ముతున్నారు. దాంతో పాటు ఐటీ ఇండస్ట్రీలను డెవలప్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కేటీఆర్ బాగా సక్సెస్ అయ్యారు.

CM KCR Making Promises Impress Farmers

CM KCR Making Promises Impress Farmers

అదొక్కటే కాదు ఇతర కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి వేలాది మందికి ఉపాధి దొరికే విధంగా ఆయన కష్టపడ్డ పేరు ఆయన సొంతం. అందుకే ఇప్పుడు యువత ఎంతో కొంత కేటీఆర్ ను నమ్ముతోందని చెప్పుకోవాలి. ఇలా కేసీఆర్ రైతాంగాన్ని, వృద్ధులు, మహిళ లను ఆకట్టుకుంటున్నారు.

ఇటు వైపు కేటీఆర్ మాత్రం యువతను మచ్చిక చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఇద్దరూ ఎవరికి వారే వర్గాలను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సెక్షన్ల ఓటర్లు ఇప్పుడు బీఆర్ ఎస్ కు మళ్లించడంలో ఈ ఇద్దరూ సక్సెస్ అయ్యారు కాబట్టి.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు తథ్యం అంటున్నారు నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us