CM KCR : ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే.. కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్లు..!

NQ Staff - November 29, 2023 / 01:15 PM IST

CM KCR : ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే.. కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్లు..!

CM KCR :

తెలంగాణలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. 29వ తేదీన అన్ని పార్టీలకు ప్రచారానికి చివరి తేదీ అయిపోయింది. దాంతో చివరి రోజున కేసీఆర్ తన ప్రసంగంలో వాడిని పెంచారు. మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించిన ప్రజాశీర్వద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు, వరంల్ పశ్చి నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ లు ఇద్దరూ బీసీ బిడ్డలు వారిని గెలిపించుకోవాలంటూ కోరారు సీఎం కేసీఆర్.

బీఆర్ ఎస్ పాలనలో వరంగల్ ను హైదరాబాద్ తర్వాత అత్యుత్తమంగా తీర్చిదిద్దాము. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ హయాంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులను వివరించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో తన దృష్టికి వచ్చిన కొన్ని నగర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు కొందరు ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే అని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎన్‌కౌంటర్లు, కాల్చివేతలు, కూల్చివేతలేనని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ చీకటే మిగులుతుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

యాభై ఏండ్ల పాలనలో ఏనాడు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన పాపన కాంగ్రెస్ పోలేదని తెలిపారు. బీఆర్ ఎస్ వచ్చిన పదేండ్లలో ఎంత డెవలప్ మెంట్ చేసిందో.. కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందో బేరీజు వేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనకు, బీఆర్ ఎస్ పాలనకు ఉన్న తేడా ఏంటో గమనించుకోవాలంటూ తెలిపారు సీఎం కేసీఆర్. ఒకప్పుడు మానుకోటలో సమైక్య వాదుల ముసుగలో రాళ్ల దాడి చేసిన వారే ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో నిలబడి ఓట్లు అడుగుతున్నారు కాబట్టి వారిని గమనించి ఓట్లు వేయాలంటూ కోరారు సీఎం కేసీఆర్.

ప్రభు్తవం స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి కూడా పట్టాలు ఇస్తాం. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ సీఎం కేసీఆర్ తన మనసులోని మాటలను బయట పెట్టేశారు. నిజాం కాలం నాటి ఆజంజాహీ మిల్లును మూసివేసి భూములను అమ్ముకున్నది కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు.

మెగా టెక్స్ టైల్ ను ఏర్పాటు చేశామని.. త్వరలోనే దానితో లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అంటూ తెలిపారు సీఎం కేసీఆర్. ఉపాధి మార్గంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటూ వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టే వరకు తాను పోరాడుతూనే ఉంటానని అందుకోసం బీఆర్ ఎస్ కు ఓటేసి గెలిపించాలంటూ కోరారు సీఎం కేసీఆర్.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us