పర్యాటక అభివృద్ధి పై దృష్టి పెట్టిన జగన్

Advertisement

అమరావతి: రాష్ట్రంలో 12 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెయ్యాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా ఉండేలా నూతన పర్యాటక పాలసీ రూపొందించాలని, రానున్న రోజుల్లో పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ ను చిరునామాగా నిలపాలని జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి అవంతితో కలిసి పర్యాటకశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజస్థాన్‌కు దీటుగా ఇక్కడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

అరకులో ఉన్న పర్యటక ప్రాంతాలను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలని,సగంలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, దీని వలన స్థానికులకు కూడా ఉపాధి దొరుకుతుందని, దీని వలన రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని జగన్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జగన్ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here