నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టిన కేసీఆర్
Admin - September 14, 2020 / 08:10 AM IST

రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని భావించిన కేసీఆర్ రాష్ట్రంలో విఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని ఇవ్వాళ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్లకు అధికారం లేదని వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని సీఎం స్పష్టం చేశారు.
ధరణి పోర్టల్‌లో అప్‌డేట్ కాగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆప్‌డేషన్ కాపీలు వస్తాయి. రెవెన్యూ కోర్టులు రద్దు చేశాం. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు. కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని సీఎం కేసీఆర్ తెలిపారు. వినియోగదారుడి యొక్క బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్ కార్డ్ లేకుండా తహశీల్దార్ కూడా ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయలేరని వెల్లడించారు.