CM KCR : ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. పనుల పరిశీలన..!
NQ Staff - March 10, 2023 / 02:00 PM IST

CM KCR : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించారు. ఇప్పటికే ఆయన పలుమార్లు ఈ పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన సచివాలయ నిర్మాణ పనుల గురించి కూలం కుషంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రారంభ తేదీని కూడా ఖరారు చేశారు.
ఏప్రిల్ 30న సచివాలయ ప్రారంభం ఉంటుందని తెలిపారు. ఇటీవలె పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని కట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట సంక్రాంతికి ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 17న ప్రారంభించాలనుకున్నారు.
కానీ ప్రతిపక్షాల విమర్శలు, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. దాంతో ఇప్పుడు కొత్త తేదీని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ఈ సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, తదితరులు ఉన్నారు.