మరో శుభ వార్త చెప్పిన కెసిఆర్

Advertisement

తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి ఎం చెయ్య బోతున్నాడు అనే విషయాల గురించే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు…. అయితే తాజాగా కెసిఆర్ తీసుకున్న ఒక నిర్ణయం తెలంగాణ ప్రజలకు కొంత ఊరటని ఇచ్చి ఆనందానికి గురి చేసేలా ఉండడం జరిగింది..ఎంటా అనుకుంటున్నారా … ప్రస్తుతం కరోనా కేసులు తెలంగాణ లో అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి

ఇక తెలంగాణ లో నమోదు అయ్యే మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా కేవలం హైదరాబాద్ నుండే నమోదు కావడం … అలాగే పరీక్షలు నిర్వహించుకున్న వాళ్లలో 30 శాతం కేసులు పాజిటివ్ రావడం జరుగుతుంది . ఇంతలా టెస్ట్ ల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రావడం కూడా తెలంగాణ లోనే ఉండడం తో తెలంగాణా ప్రజలు కాస్త భయాందోళనలకు గురవుతున్నారు . దానితో పాటుగా మరొక సమస్య కూడా హైదరాబాద్ వాసులకి ఎదురవ్వడం జరిగింది.

ప్రతి రోజుకి కొన్ని వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నప్పటికీ పరీక్షలు నిర్వహించుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. ఈ విషయం పైన తెలంగాణ వైద్య ప్రభుత్వం అలోచించి దానిని కెసిఆర్ కి చేరవేయాగా కెసిఆర్ హైదరాబాద్ లో మరిన్ని చోట్లలో కరోనా కేసులని నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆ విషయాన్నే వైద్య శాఖ మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ తెలుపుతూ ఇక నుండి కరోనా పరీక్షలను హైదరాబాద్ లో ఏకంగా 11 ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది అంటూ ఆయా ఆరోగ్య కేంద్రాల వివరాలు తెలపడం జరిగింది.

కింగ్ కోటి హాస్పిటల్ కోటి, ఫీవర్ హాస్పటల్ నల్లగుంట, చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ, నేచర్ క్యూర్ హాస్పిటల్ అమీర్ పేట్, సరోజినీ దేవి కంటి హాస్పిటల్ మెహిదీపట్నం, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎర్రగడ్డ , హోమియోపతి హాస్పిటల్ రామాంతపూర్ , నిజామి టీబీ హాస్పిటల్ చార్మినార్ , ఏరియా హాస్పిటల్ కొండాపూర్, ఏరియా హాస్పిటల్ వనస్థలి పురం, ఈ ఎస్ ఐ హాస్పిటల్ నాచారం ఈ ప్రాంతాలలో ఉచిత టెస్ట్ లు నిర్వహించే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.

అయితే ఇవన్నీ తెలుపుతూనే మీకు లక్షణాలు ఉన్నట్లు అయితే నే వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలి ఏ లక్షణాలు లేకుండా కేవలం మీకు ఉందొ లేదో తెలుసుకోవడానికి రావడం వలన సమయం వృధా అవ్వడమే కాకుండా వచ్చిన వారి నుండి మీకు సోకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి రాకూడదు అంటూ తెలపడం జరిగింది. ఈ విధంగా ఒక్క సారిగా ప్రభుత్వం లక్షణాలు ఉన్న వారికి అందరికి కూడా కరోనా పరీక్షలు అందచేయడం కోసం పరీక్ష కేంద్రాలను పెంపొందించే నిర్ణయం తీసుకున్న విషయం పట్ల ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here