బిగ్ బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ కు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేటాయించిన గవర్నర్

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. 100 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని… దానిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో వెంటనే సీఎం కేసీఆర్ దానిపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మంత్రి ఈటల భూకబ్జాపై మీడియాలో కథనాలు పుంఖానుపుంఖలు గా వచ్చాయి.

cm kcr gets health ministry from etela rajender
cm kcr gets health ministry from etela rajender

ఆ తర్వాత మంత్రి  ఈటల ప్రెస్ మీట్ పెట్టి… తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోలేదన్నారు. తనది నిజంగా తప్పు అని తేలితే… ముక్కు నేలకు రాస్తా అన్నారు. దేశంలో ఉన్న అన్ని సంస్థలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఈటల కోరారు.

cm kcr gets health ministry from etela rajender
cm kcr gets health ministry from etela rajender

అయితే.. అనూహ్యంగా ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటలను తప్పిస్తూ… వైద్య ఆరోగ్య శాఖను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని కూడా మీడియాకు గవర్నర్ విడుదల చేశారు.

Advertisement