CM KCR : ఛానల్స్ నడపండి, సినిమాలు తీయండి.. బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్
NQ Staff - April 27, 2023 / 08:39 PM IST

CM KCR : బీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని, ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లేందుకు ప్రచారం చేయాలని.. అందుకోసం సొంత టీవీ చానల్స్ నడపడంతో పాటు టీవీ ప్రకటనలు ఇవ్వాలని పేర్కొన్నారు.
సొంతంగా ఫిలిం ప్రొడక్షన్ ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి సినిమాలను తీయాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవడం కోసం అన్ని మార్గాల్లో కూడా ప్రయత్నించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మూడవ సారి అధికారం చేజిక్కించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలి పెట్టకూడదంటూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.