మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారత రత్న ఇవ్వాలి: కేసీఆర్

Advertisement

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్, పీవీకి భారత రత్న ఇవ్వాలని రానున్న అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపుతామని కేసీఆర్ తెలిపారు. అలాగే పీవీ మెమోరియల్ ను నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన్ మర్గ్ గా మార్చారు.

పీవీ నరసింహారావు సౌత్ ఇండియా నుండి ఎన్నికైన రెండవ ప్రధాని. భారతదేశ ఆర్థికస్థితిని మెరుగుపరిచిన వారిలో పీవీ ఒకరు. 1991 నుండి 1996 వరకు ప్రధానిగా కొనసాగారు. కాంగ్రెస్ తరపున దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. పీవీ గురించి అబ్దుల్ కలాం మాట్లాడుతూ….దేశం పార్టీ కంటే గొప్పదని నమ్మే వారిలో పీవీ ముందుంటారని కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here