CM KCR : కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం కేసీఆర్ బుల్లెట్ లాంటి మాటలు..!
NQ Staff - November 18, 2023 / 09:15 AM IST

CM KCR :
కేసీఆర్ స్పీచ్ లలో రోజురోజుకూ పదును పెరుగుతోంది. తన మాటల వాడితో ప్రతిపక్షాలను ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓ ఆటాడేసుకుంటున్నారు. ధరణిని బంగాళా ఖాతంలో కలిఏస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని.. ఇలాంటి పైరవీ కారులన నమ్మితే తెలంగాణను అమ్మేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేండ్లు కష్టపడి తాను ధరణి పోర్టల్ ను తయారు చేసినట్టు గుర్తు చేశారు. రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ధరణి పోర్టల్ ను ఎందుకు రద్దు చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
తాజాగా ఆయన కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీలకు అసలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మళ్లీ దళారుల దందా స్టార్ట్ అవుతుందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధరణి పోర్టల్ ను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయ్.. ధాన్యం కొన్న డబ్బులు తారుమారు అవుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భీమా, రైతు బంధు, ధాన్యం డబ్బులు, ధరణిని కాపాడే వారు కావాల్నా.. వాటిని రద్దు చేసే వారు కావాలా అంటూ ప్రశ్నించారు ప్రజలను.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పదేండ్ల కష్టం మన్ను పాలు అవుతుందని తెలిపారు. మళ్లీ కరెంట్ కష్టాలు మనకు తప్పవు.. ఇప్పుడు పండిస్తున్న ధాన్యంలో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ఇంక చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నుల వరకు పండుతుంది. కానీ కాంగ్రెస్ వస్తే ఇప్పుడున్న దాంట్లో సగం కూడా పండవు. వారు మూడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారు. దాంతో పొలాలు పారవు. ఎడారి బీళ్లుగా మన పొలాలు మారుతాయి. బీఆర్‌ఎస్ పడ్డ కష్టం బూడిదిలో పోసిన పన్నీరైతది. పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును తెచ్చుకున్నట్టే అవుతుందని చెప్పుకొచ్చారు సీఎం.
గతంలో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే మన తెలంగాణను ఆగమాగం చేశారంటూ గుర్తు చేశారు సీఎం కేసీఆర్. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్లీ వలసలు పోయే బతుకులు రావొద్దంటే బీఆర్ ఎస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్, హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డిని, చొప్పదండిలో సుంకె రవిశంకర్ ను, పరకాలలో చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ కు పొరపాటును ఓటేసినా మూడు గంటల కరెంట్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా వందలాది మంది ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా గోస పెడుతుందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు నిధులు రావట్లేదని మండిపడ్డారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేసి బీఆర్ ఎస్ కు ఓటేయాలని కోరారు.