కరోనా మరణాలను ప్రభుత్వం దాచలేదు: కేసీఆర్

Advertisement

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరోనా విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఇప్పటికే కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ఇప్పుడు ప్రజలు తమ జాగ్రత్తను తాము కూడా తీసుకోవాలని వెల్లడించారు. అలాగే కరోనా మరణాలు ప్రభుత్వం దాచేస్తుందని వస్తున్న వ్యాఖ్యల పై కూడా కేసీఆర్ మాట్లాడారు. కరోనా మరణాలను ప్రభుత్వం దాచలేదని, దాచాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు.

కరోనా వచ్చిన తరువాత ఆర్థికంగా స్థిరపడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని గర్వంగా ప్రకటిస్తున్నానని వ్యాఖ్యానించారు. డబ్బులకు గతిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి మించి ఇంకేదీ తమకు ప్రాధాన్యం కాదని సీఎం స్పష్టం చేశారు. కరోనా మరణాలను ప్రభుత్వం దాయకపోతే కోర్ట్ ఎందుకు తప్పు పట్టిందో చెప్పాలని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here