బ్రేకింగ్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ప్రకటించిన సీఎం కేసీఆర్

ప్రస్తుతం తెలంగాణలో కరోనా ఎంతలా విజృంభిస్తోందో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా కరోనా కేసులే. ఏ ఆసుపత్రుల్లో చూసినా కరోనా పేషెంట్లే. ఓవైపు కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తున్నా… కరోనా మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే… కరోనా వైరస్ ఉద్ధృతి ఇంకా పెరగకముందే… తెలంగాణలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు.

CM KCR announces FREE COVID19 Vaccine to all the eligible people in telangana
CM KCR announces FREE COVID19 Vaccine to all the eligible people in telangana

ఇప్పటికే సీఎం కేసీఆర్ కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్న కేసీఆర్… 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ ను తానే స్వయంగా పర్యవేక్షిస్తాని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అలాగే… రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజెక్షన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు… సుమారు 2500 కోట్లు ఖర్చు అవుతుందని కేసీఆర్ తెలిపారు. అయితే… ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ముఖ్యమని… అందుకే ఎంత ఖర్చయినా ప్రజల నుంచి రూపాయి కూడా తీసుకోకుండా… ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Advertisement