Etela Rajender : ఈటల తర్వాత సీఎం కేసీఆర్ టార్గెట్ ఆ మంత్రులే?

Etela Rajender : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఈటల రాజేందర్ ను చివరకు మంత్రి వర్గం నుంచి కూడా బర్తరఫ్ చేశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. సీఎం కేసీఆర్ కావాలని ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని.. ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని… చివరకు రైతులు కేసీఆర్ కు లేఖ రాయడం దగ్గర్నుంచి… మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేయడం వరకు అన్నింటి వెనుక సీఎం కేసీఆర్ ఉండి నడిపించారని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరో వార్త కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

cm kcr also planning to dismiss other two ministers from cabinet
cm kcr also planning to dismiss other two ministers from cabinet

నిజానికి సీఎం కేసీఆర్ ఫోకస్ చేసింది ఒక్క ఈటల రాజేందర్ ను మాత్రమే కాదట. మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారట. మరో ఇద్దరు మంత్రులను కూడా సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారట. ముందు ఈటల పని పూర్తయ్యాక ఆ తర్వాత ఆ ఇద్దరు మంత్రలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారట. ఈటలను ఇప్పటికే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఇక.. మిగిలిన ఆ ఇద్దరు మంత్రుల వ్యవహారాలపై సీఎం కేసీఆర్  దృష్టి పెట్టారట.

ఆ ఇద్దరు మంత్రులతో పాటు.. కొందరు ఎమ్మెల్యేలపైనా సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడం, పార్టీ ప్రతిష్ఠను బజారుకీడ్చడం లాంటి పనులు చేస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ముందే జాగ్రత్త పడుతున్నారట. లేదంటే బీజేపీకి అది రాజకీయంగా కలిసి రావడంతో పాటు.. టీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ముందు ఊహించి.. దిద్దుబాటు చర్యలకు సీఎం కేసీఆర్ ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Advertisement