Agneepath Scheme: అగ్నిపథ్.! కేసీయార్ చేతికి మోడీ ఇచ్చిన ఆయుధం.?
NQ Staff - June 18, 2022 / 04:22 PM IST

Agneepath Scheme: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘అగ్నిపథ్ స్కీమ్’ అల్లర్ల నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ అనే యువకుడి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

CM KCR Agneepath Scheme
రాకేష్ అంత్యక్రియల్లో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేతలు పాల్గొన్నారు. ఇక్కడి నుంచే, కేంద్రంపై అగ్నిపథ్ స్కీమ్‌కి వ్యతిరేకంగా తాము పోరాటం ప్రారంభించామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దాంతో, ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
పాతిక లక్షలు అక్కడిచ్చారు.. ఇక్కడేమైంది.?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోంటే, వారిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ సమస్యలపై విద్యార్థులు మండిపడుతున్నా, నిధుల విడుదలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదన్న విమర్శలున్నాయి. అక్కడేమో నిధుల కొరత, ఇక్కడేమో.. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం ఘటనలో పాల్గొన్న ఆందోళనకారుల్లో ఒకరైన రాకేష్ మృతికి సంఘీభావం తెలపడమేంటి.? ఆర్థిక సాయం చేయడమేంటి.? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్, ఈ అగ్నిపథ్ స్కీమ్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారన్నది సుస్పష్టం. ఈ రోజు సాయంత్రం కేసీయార్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారట. సో, కేసీయార్ నుంచి మాటల తూటాలు పేలబోతున్నాయి.
ఓ రకంగా చూస్తే, కేసీయార్ చేతికి ప్రధాని నరేంద్ర మోడీనే అగ్నిపథ్ స్కీమ్ రూపంలో ఆయుధాన్నిచ్చినట్లయ్యింది.