మందిరం, మసీదు, చర్చిని కొత్త సచివాలయంలో నిర్మిస్తాం : సీఎం కెసిఆర్

Advertisement

తెలంగాణాలో కొత్త సచివాలయం నిర్మించడానికి పాత సచివాలయం కూల్చివేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే సచివాలయం కూల్చివేతలో మందిరం, మసీద్ లు ద్వాంసం అయ్యింది. దీనితో ప్రతి పక్షాలు, నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ముస్లిం పెద్దలతో సమావేశం అయ్యారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదులు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అయితే పాత భవనాలు కూల్చివేస్తున్న సమయంలో మందిరం, రెండు మసీదులకు నష్టం జరిగిందని, వాటిని ప్రభుత్వం పూర్తి ఖర్చుతో అన్ని సదుపాయాలతో నిర్మిస్తామని కేసీఆర్‌ తెలిపారు. అలాగే ఒకే రోజు అన్ని మందిరాలకు శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here