కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం : సీఎం కెసిఆర్

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు గల కారణం కాంగ్రెస్, టీడీపీనే అని సీఎం కేసీఆర్ విమర్శించారు.అయితే కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలున్నాయని పేర్కొన్నాడు. ప్రజల యొక్క అవసరాలు తీర్చే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని కొనియాడారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని తెరాస పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. కొత్త విద్యుత్ చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు విద్యుత్ మీటర్లు పెట్టాలన్నారు. అయితే కొత్త మీటర్ల కోసం 700 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని తెలిపాడు.

విద్యుత్ మీటర్ రీడింగ్ తో బిల్లులు ఇస్టానురాజ్యంగా వసూలు చేస్తారన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని తెలిపారు. మన భారత్ లో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉందని బయటపెట్టారు. అలాగే మిగిలిన విద్యుత్‌ను దేశ ప్రగతికి ఉపయోగించాలని ఉద్దేశం కేంద్రానికి లేదని ఫైర్ అయ్యాడు. కరోనా కారణంగా మూడు నెలల బిల్లులు ఒకేసారి వచ్చాయని వివరించారు. ఇక ఈ విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here