బీసీ నాయకులపై దృష్టి పెట్టిన జగన్, కంగారులో టీడీపీ

బీసీ కులస్తులకు టీడీపీ మొదటి నుండి పెద్ద పీట వేస్తూనే ఉంది. ఆలాగే మొదటి నుండి టీడీపీ పార్టీని మొదటి నుండి నడిపిస్తుంది కూడా బీసీ నేతలే. అయితే 2019 ఎన్నికల తరువాత బీసీ నేతలు మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. ఇప్పటికే చాలామంది బీసీ నేతలు వైసీపీలో , బీజేపీలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి మరింత శ్రద్ద చూపిస్తున్నారు.

తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే, బీసీ నాయకుడు వాసుపల్లి గణేష్ కూడా వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు కంగారు పడుతున్నారు. తనకు ఇన్నాళ్లు అండగా ఉన్న బీసీ నాయకుడు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. గణేష్ ను టీడీపీ తరపున రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా చేయడానికి సిద్ధమవుతున్న బాబుకు గణేష్ షాక్ ఇచ్చారు. టీడీపీ యొక్క బలం బీసీలని గుర్తించిన జగన్, ఆ బలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జగన్ రానున్న రోజుల్లో బీసీలను కూడా పూర్తిగా ఆకర్షించగలిగితే టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.