అమరావతి రైతుల పై సీఎం జగన్ మాస్టర్ ప్లాన్!
Admin - September 16, 2020 / 05:44 AM IST

అమరావతి రైతుల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. జగన్ రైతుల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రేవేశపెట్టినా కూడా రైతుల నుండి జగన్ ఆదరణ పొందలేకపోతున్నారు. అలాగే రైతుల పట్ల జగన్ మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ విమర్శల నుండి బయటపడటానికి జగన్ ఒక మాస్టర్ ప్లాన్ ను రచించారు.
అమరావతి రైతులతో చర్చలు జరపడానికి జగన్ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో వార్త వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కోడలి నాని లాంటి నాయకులు అమరావతి రైతులతో చర్చలకు సిద్ధమని చెప్పిన విషయం తెలిసిందే. ఒకవేళ రైతులతో జగన్ చర్చలు జరిపి వాళ్లకు న్యాయం చేస్తే జగన్ రైతుల దృష్టిలో చిరకాలం నిలిచిపోతారు. జగన్ రానున్న రోజుల్లో అమరావతి రైతులతో చర్చలు జరుపుతారో లేదో వేచి చూడాలి.