CM Jagan : అడ్డుపడినా ఆగేది కాదు.. విశాఖలో మకాం తప్పదు

NQ Staff - December 6, 2023 / 12:26 PM IST

CM Jagan : అడ్డుపడినా ఆగేది కాదు.. విశాఖలో మకాం తప్పదు

CM Jagan :

సీఎం జగన్.. తాను ఏది తలిస్తే అది దాదాపు చేసేస్తారు. సీఎంగా ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసమైతే అసలే వదిలిపెట్టరు. ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటారు. జగన్ ఈ వైఖరితోనే ప్రతిపక్షాలకు కంటినిండా నిద్ర కరువైంది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తానని జగన్ ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సీఎం నిర్ణయంతో తమ కలల సౌధం..‘‘అమరావతి’’కి, తాము సంపాదించుకున్న వేలాది ఎకరాల భూములకు శరాఘాతమే అని భావించి అడ్డదిడ్డంగా వాదనలకు తెరతీశాయి.

ఇదిలా ఉండగా విశాఖకు సీఎం జగన్ మకాం మార్చడం దాదాపు ఖాయమైంది. రుషికొండ మీద ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు ఖాళీగా ఉన్న ఇతర భవనాలను తీసుకుని కీలక శాఖల ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

అయితే సీఎం క్యాంపు ఆఫీస్ ను రుషికొండ మీద పెట్టనివ్వకుండా మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డిసెంబర్ తొలివారంలో కేంద్ర బృందం విశాఖకు వచ్చి రుషికొండను సందర్శించనుంది. హైకోర్టుకు ఈ బృందం నివేదిక ఇవ్వనుంది.

విశాఖలో విమ్స్ భవనాలు ఖాళీగా ఉన్నాయనేది తెలిసిందే. అయితే అక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయవద్దని వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వేరే ఎక్కడైనా ఆఫీసులు పెట్టుకోవాలి గానీ విమ్స్ భవనాలే దొరికాయా? అంటూ ఎర్రన్నలు మండిపడుతున్నారు.

అయితే రుషికొండ మీద ఉన్న టూరిజం భవనాలూ ప్రభుత్వానివే. విమ్స్ భవనాలూ ప్రభుత్వానివే. కానీ ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ భవనాల్లో పెట్టకోనివ్వకుండా విపక్షాలు నానా యాగీ చేయడం ఎంతవరకు సమంజసమని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలపై కోర్టులకు ఎక్కడం ఏంటని విపక్షాలపై జనాలు మండిపడ్తున్నారు.

ఇదిలా ఉండగా ఆరునూరైనా డిసెంబర్ మొదటి వారానికల్లా జగన్ విశాఖకు వస్తారని వైసీపీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేస్తారని స్పష్టం చేస్తున్నాయి. క్యాంపు ఆఫీసు నుంచి సమీక్ష సైతం ఉంటుందని అంటున్నాయి. చివరి ప్రయత్నంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయా లేక విశాఖకు సీఎం మకాం అన్నది జాప్యం అవుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

విపక్షాలు అడ్డుకున్నా.. సీఎం విశాఖ నుంచి పాలించడాన్ని ఎవరూ ఆపలేరని మాత్రం అర్థమవుతోంది. సీఎం జగన్ ఒక్క సారి కమిట్ అయ్యాక.. దానికి తిరుగుండదు అని ఆయన్ను ఫాలో అయ్యేవారికి బాగానే తెలిసే ఉంటుంది. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే గుడ్డిగా దాన్ని వ్యతిరేకించాలని ఏపీ విపక్షాలు భావిస్తున్నాయి. అంతే తప్ప జగన్ విశాఖకు రావడాన్ని కొద్దిగా లేట్ చేయవచ్చు కానీ మొత్తానికే రాకుండా ఆపలేరనేది మాత్రం నిజం.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us