CM Jagan : తుఫాను ప్రభావంపై వేగంగా స్పందిస్తున్న జగన్.. యుద్ధ ప్రాతిపదికన సాయం..!

NQ Staff - December 5, 2023 / 05:00 PM IST

CM Jagan : తుఫాను ప్రభావంపై వేగంగా స్పందిస్తున్న జగన్.. యుద్ధ ప్రాతిపదికన సాయం..!

CM Jagan :

ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి సీఎం అయితే వారికి ఏ అపాయం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. తుఫాన్ వేగంతో వారికి న్యాయం చేయాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తే సీఎం జగన్. ఆయన ఏ విషయంలో అయినా సరే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తూ ఉన్నారు. ఎలాంటి చిన్న అపాయం వచ్చినా సరే దానిపై సర్వత్రా నివేదికలు తెప్పించుకుని వెంటనే సాయం అందించే చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా తుఫాన్ బాధితుల విషయంలో మరోసారి ఇది నిజమని నిరూపించుకున్నారు సీఎం జగన్. ప్రభావిత జిల్లాలో వేగంగా సాయం అందేలా చూస్తున్నారు సీఎం జగన్.

గతంలో టీడీపీ ప్రభుత్వం సమీక్షల పేరుతో కాలం వెల్లదీసేది. కానీ జగన్ ప్రభుత్వం అలా కాదు. ముందు పని చేసిన తర్వాతనే సమీక్షలు చేస్తుంది. అక్కడ బాధితులకు సాయం అందిన తర్వాతనే రిలాక్స్ అవుతుంది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఏదైనా చిన్న అపాయం వచ్చినా సరే బాధితులకు సహాయం అందించడానికి సంత్సరాల వ్యవధి పట్టేది. సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్ళరిగెలా తిరిగినా ఫలితం ఉండేది కాదు. కానీ అలాంటి వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థతో ఇప్పుడు ఏ పని అయినా సరే క్షణాల్లోనే జరిగిపోతోంది.

నష్టం జరిగిన గంటల వ్యవధిలోనే న్యాయం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా వరికోతల సమయంలో మిచాంగ్ తుఫాన్ విరుచుకుపడింది. దాని దెబ్బకు రైతులు విలవిలలాడిపోతున్నారు. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం ప్రభావిత జిల్లాలకు అధికార యంత్రాన్ని పంపించింది. నష్టం జరిగిన ప్రతి ఇంటికి న్యాయం అందిచాలని ఆదేశించారు జగన్. తేమ శాతంతో సంబందం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అసవరమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనలు సడలిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Helped Typhoon Victims

CM Jagan Helped Typhoon Victims

దాంతో రైతన్నలు తుఫాన్ గండం నుంచి గట్టెక్కిపోయారు. ఎప్పుడు తుఫాన్ వచ్చినా సరే తుఫాన్ వేగంతో స్పందిస్తూ వారికి న్యాయం అందేలా చూస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వారికి పదివేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. దాంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి ఇంటికి వెయ్యి రూపాయల నుండి, 2500 రూపాయల సహాయం అందించేలా చర్యలు తీసుకుంది. బాధితులు క్యాంపులకు రాకుండానే 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us