సాగునీటి పై జగన్ ప్రత్యేక శ్రద్ధ, రైతులకు మరో వరం

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ఒక్క అధికారం ఇస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అందిస్తానని చెప్పిన జగన్ ఆ మాటను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజల్లో జగన్ క్రేజ్ మరింత పెరిగింది. జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న క్రేజ్ ను చూసి ప్రతిపక్షాలు నిద్ర కూడా పోవడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఇప్పుడు రైతులపై కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. తాజాగా ఉచిత విద్యుత్ నగదు బదిలీతో రైతులకు ఆర్థిక సహాయం కూడా చేయనున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో కోటి ఎకరాలకు పైగా ప్రాజెక్ట్ ల ద్వారా సాగునీరు అందించింది ఏపీ ప్రభుత్వం. 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించారు. ఒకరకంగా ఏపీ చరిత్రలో ఇది ఓ రికార్డు.

అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను కూడా జగన్ ప్రభుత్వం బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ప్రస్తు ఖరీఫ్ లో 1,11,41,471 ఎకరాలకు సాగునీరు అందివ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. 1.11 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందాయి. ఈ ప్రణాళికలు సక్రమంగా అమలు అయితే రైతుల మనసుల్లో జగన్ యొక్క స్థానం మరింత పదిలం కానుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here