టీడీపీ హయాంలో తీసుకున్న 900 ఎకరాలు మీద దృష్టి పెట్టిన జగన్

Advertisement

ఏపీలో ఉన్నంత హాట్ రాజకీయాలు ఏ రాష్ట్రంలో ఉండవు. ఇక్కడ రాజకీయాలు అన్ని కూడా రాజధాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అమరావతిలోనే రాజధాని ఉండాలని టీడీపీ నాయకులు, అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఉండాలని వైసీపీ నాయకులు నిత్యం కొట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిలో జరిగిన అక్రమాలపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారు.

మొత్తంగా 4075 ఎకరాల భూమి టీడీపీ నేతలు, వాళ్ల బినామీల చేతుల్లో ఉన్నట్టు, వీటిలో 900 ఎకరాల అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్నట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఆ భూములను తిరిగి రైతులకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రైతుల భూములను తిరిగి ఇప్పిస్తే జగన్ వాళ్ళ దృష్టిలో దేవుడిలా నిలిచిపోతారు. అలాగే రైతుల పట్ల టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రను కూడా బయటపెట్టి టీడీపీని శాశ్వతంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here