జగన్ సీఎం అయ్యాక దారుణంగా విఫలమైంది ఈ ఒక్క మ్యాటర్లోనే.. పూర్తిగా ముంచేశారు

Admin - October 23, 2020 / 08:46 PM IST

జగన్ సీఎం అయ్యాక దారుణంగా విఫలమైంది ఈ ఒక్క మ్యాటర్లోనే.. పూర్తిగా ముంచేశారు

ఈ ఏడాదిన్నర పాలనలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల్లో దారుణంగా ఫ్లాప్ అయిన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అదే ఇసుక పాలసీ. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా నడిపి నాయకులు కోట్లకు కోట్లు దోచుకున్నారని ప్రజలకు అర్థమయ్యే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారు. అలాంటి ఇసుక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో చేద్దామనుకుని ఇంకేదో చేసి జనం ఆగ్రహానికి గురవుతున్నారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా నడిచిందనేది ఎంత వాస్తవమో నిర్మాణ రంగానికి కావాలసినంత ఇసుక దొరికేదన్నది కూడ అంటే వాస్తవం. అయితే ఆ ఉచిత ఇసుక పాలసీని నేతలు మాఫియా నడపడానికి వాడుకున్నారు.

YS Jagan fans unhappy with new dandy policy

YS Jagan fans unhappy with new dandy policy

అలాంటప్పుడు వైఎస్ జగన్ ఏం చేయాలి.. అదే ఉచిత ఇసుక ఫార్ములాను ఫాలో అయ్యి అవినీతిని అరికట్టాలి. కానీ ఆయన అలా చేయలేదు. కొత్త పాలసీ పేరుతో ఇసుక రవాణాను నిలిపి వేశారు. దాంతో కొన్ని నెలలపాటు ఇసుక రీచ్ల నుండి బయటకు రాలేదు. ఫలితంగా నిర్మాణ రంగం కుదేలయ్యి అనేక మంది కూలీలకు జీవనోపాధి లేకుండా పోయింది. సరే ఆ తర్వాతైనా గొప్ప పాలసీ చేశారా అంటే అదీ లేదు. ఇసుక ధరలు పెంచేశారు. ఇన్నాళ్లు ఉచితంగా ఇసుక తీసుకుంటున్న జనాలకు డబ్బులు పెట్టి ఇసుక కొనుక్కోవడం అనేది పెద్ద భారంలా మారింది. ఇక వైసీపీ నేతలైతే తామేమన్నా తక్కువ తిన్నామా అంటూ చేతివాటం చూపారు. పరిస్థితి మునుపటి కంటే దారుణంగా మారింది.

YS Jagan fans unhappy with new dandy policy

YS Jagan fans unhappy with new dandy policy

ప్రజలు అల్లాడుతున్నా వైసీపీ నేతలు మాత్రం తమ ఇసుక పాలసీ గొప్ప పాలసీ అంటూ వచ్చారు. కామీ చివరకు జనంలోని ఆగ్రహం అధిష్టానానికి తెలిసొచ్చింది. పెను భారంగా మారిన పాలసీలో మార్పులు, సవరణలు చేయడానికి పూనుకుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అంటూ సలహాలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. దీంతో జనం ఇంతోటి దానికి మమ్మల్ని ఇంతలా ఇబ్బందులకు గురిచేయడం అవసరమా, ఉచిత ఇసుక పద్దతిని కొనసాగించి అవినీతిని అరికడితే సరిపోయేది కదా అంటూ మండిపడుతున్నారు. ఇదంతా చూసిన వైసెపీ కార్యకర్తలు, అభిమానులు జగన్ ఈ ఒక్క విషయంలోనే దారుణంగా విఫలమయ్యారు అంటూ డిసప్పాయింట్ అవుతున్నారు.

 

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us