నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
Admin - July 20, 2020 / 10:26 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ తో పోరాడుతున్నాయి. ఇప్పటి వరకు చాలా దేశాల శాస్త్రవేత్తలు కరొనాకు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇది ఇలా ఉంటె తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు వైద్యులు.
ఇద్దరు వాలంటీర్స్ కు కోవాక్సీన్ అనే వాక్సిన్ ను ఇచ్చి నిమ్స్ హాస్పటల్ వైద్యులు వాళ్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.అయితే ఈ కోవాక్సీన్ ను మన ఇండియా కి చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ రూపొందించింది.
ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్( ICMR ) మరియు పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజి సహకారంతో హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ కోవ్యాక్సిన్ పేరుతో ఓ టీకా ను అభివృద్ధి చేసింది. ఇక ఇప్పటికే ఈ కోవాక్సీన్ మొదటి మరియు రెండవ క్లినికల్ ట్రయల్స్ ను జరిపేందుకు ఇండియాన్ డ్రగ్స్ రెగ్యులేటరీ అనే సంస్థ అనుమతులను మంజూరు చేసింది.
దేశ వ్యాప్తంగా మొత్తం పన్నెండు వైద్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అలాగే మొత్తం మూడు వందల డెబ్భై ఐదు మంది వాలింటర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే ఈ వ్యాక్సిన్ ను ఆగష్టు పదిహేను తేదీ వరకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మన ఇండియాలో అభివృద్ధి చేస్తున్న తోలి కొవ్యాక్సిన్ కావున అందరి దృష్టి ఈ వ్యాక్సిన్ మీదనే ఉంది.