నిమ్స్ లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం

Advertisement

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో కొన్ని దేశాలలో క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దింట్లో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి కూడా ఒకటి. తాజాగా నిమ్స్ లో జరుగుతున్న ట్రయల్స్ లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయింది. అయితే ఈ విషయాన్నీ నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

అలాగే వారం రోజుల్లో రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభిస్తామని డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో యాభై మంది మీద ట్రయల్స్ ప్రయోగించమని తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రయోగించిన వ్యక్తులు అందరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఐసీఎంఆర్ ఉత్తర్వుల మేరకు నిమ్స్ నుండి వ్యాక్సిన్ కోసం ప్రయత్నం కొనసాగిస్తున్నామని అన్నాడు. అలాగే కరోనా కట్టడికి ప్లాస్మా థెరపీ మంచిగా పనిచేస్తుందని, కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరు కూడా ప్లాస్మా దానం చేయటానికి ముందుకురావాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here