Whatsapp: వాట్సాప్‌లో వ‌చ్చే ఈ లింక్ క్లిక్ చేశారో, మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు అన్నీ మాయం..!

Whatsapp: ప్రముఖ మెసేంజిగ్‌ యాప్‌ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఒక్కోసారి దీని వ‌ల‌న యూజ‌ర్స్‌కి లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాట్సప్ పాలసీలను ఎవ‌రైన ఉల్లంఘిస్తే వారికి అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. యూజర్లు తప్పనిసరిగా కొన్ని నిబంధ‌నలు పాటించాలి. లేకపోతే వాట్సప్ వారి అకౌంట్‌ను సస్పెండ్ చేయొచ్చు. లేదా తాత్కాలికంగా అకౌంట్ బ్లాక్ చేయొచ్చు.

Clicking WhatsApp links exposes you to cyber theft
Clicking WhatsApp links exposes you to cyber theft

ఇటీవ‌లి కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాలు ఎక్కువ అవుతున్నాయి. వాట్సాప్‌ని కూడా ఉయోగించి ఇప్పుడు మోసం చేస్తున్నారు. అమూల్ డెయిరీ 75వ వార్షికోత్స‌వం సంద‌ర్బంగా ఓ కాంపిటీష‌న్ నిర్వ‌హిస్తోందని, ఓ స‌ర్వేలో పాల్గొని వివ‌రాల‌ను నింపి పంపితే రూ.6000 గెలుచుకోవ‌చ్చంటూ వాట్సాప్‌లో ఓ సందేశం వ‌స్తుంది.

ఆ సందేశంలో లింక్ కూడా వ‌స్తుంది. దానికి పేరు అమూల్ అని ఉంది కానీ.. ఆ వెబ్‌సైట్ మాత్రం వేరేది. అమూల్ ది కాదు. అందువ‌ల్ల ఈ మెసేజ్ న‌కిలీ మెసేజ్ అని నిర్దార‌ణ అయింది. క‌నుక ఎవ‌రైనా స‌రే వాట్సాప్ లో త‌మ‌కు ఈ మెసేజ్ వ‌స్తే దానికి స్పందించ‌కూడ‌ద‌ని, అందులో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే అంతే సంగ‌తుల‌ని అంటున్నారు.

డ‌బ్బులు కోల్పోయేందుకు అవ‌కాశాలు ఉంటాయని, ఫోన్ వినియోగ‌దారుల‌కు చెందిన డేటా అంతా చోరీకి గుర‌వుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక మీకు ఈ లింక్ వ‌స్తే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓపెన్ చేయ‌కండి అని చెబుతున్నారు.