అక్టోబర్‌ 15వ తేదీ నుండి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు రూల్స్ ఇవే..!

Admin - October 6, 2020 / 10:40 AM IST

అక్టోబర్‌ 15వ తేదీ నుండి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు రూల్స్ ఇవే..!

కరోనా దాటికి మూతపడ్డ అన్ని సంస్థలు అన్ లాక్ ప్రక్రియ ద్వారా మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి. అయితే తాజాగా కేంద్రం అన్ లాక్ 5.0 లో భాగంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక దేశ వ్యాప్తంగా అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు వెల్లడించింది. అయితే ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల ప్రకారం యాభై శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తీర్చుకోవాలని సూచించింది. సినిమా హాళ్లు తెరుచుకోనున్న ఈ విషయాన్నీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించాడు.
కేంద్రం విధించిన మార్గదర్శకాలు ఇవే..!

 • సినిమా థియేటర్లలోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలి
 • థియేటర్లలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి
 • ఖాళీగా వదిలేసిన సీట్ల పై మార్కింగ్‌ వేయాలి
 • థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తరువాతే థియేటర్ లోకి అనుమతించాలి
 • థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి
 • శానిటైజర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి
 • అందరూ ఆరోగ్యసేతు యాప్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చర్యలు
  తీసుకోవాలి
 • ఎక్కువగా ఆన్‌ లైన్‌ పేమెంట్ ‌కే ప్రాధాన్యత ఇవ్వాలి
 • టికెట్‌ కౌంటర్ల దగ్గర, థియేటర్ పరిసరాల్లో, లోపల ఎప్పటికప్పుడు
  శానిటైజ్‌ చేయాలి
 • థియేటర్లలో ప్యాకేజ్‌ ఫుడ్‌ మాత్రమే అనుమతించాలి
 • ఏసీ టెంపరేచర్‌ 23 డిగ్రీల పైన ఉండాలి

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us