Ramoji Rao : రూ.793 కోట్ల రామోజీ ఆస్తులు అటాచ్…
NQ Staff - May 30, 2023 / 06:56 PM IST

Ramoji Rao : ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ పై ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సోమవారం సీఐడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు మరియు రామోజీ గ్రూప్ కు సంబంధించి రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది.
రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లు సీఐడీ తమ విచారణ లో ఆరోపించింది. చిట్ల ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆఫీస్ కు తరలించి వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని మార్గదర్శి గ్రూప్ పై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మార్గదర్శి నిధుల బదలాయింపు చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధమని సీఐడీ అభియోగం. చిట్ ఫండ్ నిధులు చట్టవిరుద్దంగా దారి మల్లించడం వల్ల మార్గదర్శి లో నిధుల కొరత ఏర్పడి చిట్స్ కాల పరిమితి ముగిసిన తరువాత కూడా వినియోగదారులకు డబ్బులు ఇవ్వడం లేదని సీబీఐ పేర్కొంది.
ఈ నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నామని సీఐడీ తెలిపింది. ముందు ముందు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనేది చూడాలి. మరో వైపు ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ కొందరు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పెద్ద ఎత్తున రామోజీ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.