CID Ready Arrest Nara Lokesh On Fiber Gird Case : లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఆ కేసులో అదుపులోకి తీసుకునే ఛాన్స్..?

NQ Staff - September 18, 2023 / 02:44 PM IST

CID Ready Arrest Nara Lokesh On Fiber Gird Case  : లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఆ కేసులో అదుపులోకి తీసుకునే ఛాన్స్..?

CID Ready Arrest Nara Lokesh On Fiber Gird Case : 

ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కిపోయాయి. అయితే ఇప్పుడు మరో అరెస్ట్ కూడా తప్పదని అంటున్నారు. అది ఎవరిదో కాదు లోకేష్ దే. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి రాగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

కాగా లోకేష్ ను ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఈ కేసులో ఇప్పటికే కొందరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలోనే లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం మీద విమర్శలు బాగా వస్తాయనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

తొందరపడి లోకేష్ ను అరెస్ట్ చేయొద్దని సంకేతాలు వెళ్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ లోకేష్ ను అరెస్ట్ చేయడానికి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారని మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

లోకేష్ ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారంట. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us