Choreographer Rakesh Master : రాకేష్ మాస్టర్ ఆస్తులు ఎన్నికోట్లో తెలుసా.. ఇంత సంపాదించాడా..!
NQ Staff - June 19, 2023 / 10:43 AM IST
Choreographer Rakesh Master : రాకేష్ మాస్టర్.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పించిందే ఆయన. అంతెందుకు ఇప్పుడున్న టాప్ కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నవారే. ఒకప్పుడు ఆయన లెజెండరీ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోలకు కూడా ఆయన డేట్స్ దొరికేవి కావు.
దాదాపు 1500లకు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆయన మానసిక సమస్యలతో సినిమా అవకాశాలు కోల్పోయారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. కొంత కాలంగా ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల్లోనే ఉన్నారు.
కానీ వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.
రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు భారీగానే ఆస్తులు సంపాదించారు. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగలా ఉంది. దాంతో పాటు హైదరాబాద్ శివారులో రెండెకరాల భూమి కూడా ఉంది. దాని విలువ రూ.45 కోట్లు అని తెలుస్తోంది. లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ కలిపి రూ.68 కోట్లు అని తెలుస్తోంది.