UPPENA : ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవ‌రు వ‌స్తున్నారో తెలుసా?

UPPENA : మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో డెబ్యూ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం కానున్నారు. ఉప్పెన చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుదల కానుండ‌గా, ఈ సినిమాతో చిత్ర క‌థానాయిక కృతి శెట్టి కూడా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్, టీజ‌ర్ చూసి ప్రేక్ష‌కులు మూవీపై భారీగానే అంచ‌నాలు పెంచుకున్నారు.

ఉప్పెన చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ జాల‌రిగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.లాక్‌డౌన్ కంటే ముందే చిత్ర షూటింగ్‌ని పూర్తి అయిన‌ప్ప‌టికీ. ఈ మూవీ క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఓటీటీలో విడుద‌ల చేయ‌లేదు. థియేట‌ర్లు తెరుచుకున్నాక మూవీ రిలీజ్‌కు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వరి 6 సాయంత్రం జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఎంతో మంది మెగా హీరోల‌కు త‌న స‌పోర్ట్ అందించిన చిరు.. వైష్ణ‌వ్ తేజ్‌ను ఆశీర్వదించాల‌ని భావించి ఈ వేడుకకు హాజ‌ర‌వుతున్నారు.

Advertisement