Breaking పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటదో కూడా అందరికీ తెలుసు. బాక్సాఫీసు బద్దలు అవ్వాల్సిందే. అసలు వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు థియేటర్ల మీద పడ్డారు. కేవలం ట్రైలర్ కే ఇలా ఉంటే.. ఇక సినిమా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వెండి తెర మీద కనిపించక మూడు సంవత్సరాలు కావస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఏప్రిల్ 9 న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే టికెట్లు అన్నీ ఫుల్. ఎక్కడా థియేటర్లలో ఖాళీలు లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే.. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా వకీల్ సాబ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.
ఇప్పటి వరకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ పై పోస్ట్ పెట్టని మెగాస్టార్ చిరంజీవి తాజాగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ గురించి సంచలన ట్వీట్ పెట్టడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్వీట్ గురించే చర్చ నడుస్తోంది.
చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను వెండి తెర మీద చూడటానికి మీలాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్ సాబ్ ను చూస్తున్నాను. సినిమా చూశాక… నా స్పందన తెలియజేయడం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను… అంటూ పవన్ తో ఉన్న ఓ ఫోటోను చిరు షేర్ చేశారు. బహుశా… అది ఏదో సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో తీసినట్టుగా ఉంది. పవన్ కు ఎంతో ప్రేమతో చిరు దువ్వెనతో హెయిర్ ను దువ్వుతుండగా… పవన్ మాత్రం అద్దంలో తన ముఖం చూసుకుంటున్నాడు.
చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned 🙂 pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021