Chiranjeevi : రామ్ చరణ్ విషయంలో చిరు కీలక నిర్ణయం.. ఇండస్ట్రీలో తన తర్వాత అతనికే బాధ్యతలు..?
NQ Staff - September 23, 2023 / 01:44 PM IST

Chiranjeevi :
చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాంటి వాడు. ఏ కార్యక్రమం జరిగినా సరే ముఖ్య అతిథిగా వెళ్తుంటాడు. ఇండస్ట్రీ తరఫున తానే బాధ్యత తీసుకుంటారు. అలాంటి చిరంజీవి రెండు నెలలుగా బయట కనిపించట్లేదు. ముఖ్యంగా భోళా శంకర్ తర్వాత ఆయన ఎక్కడికి రావట్లేదు. కనీసం ఎక్కడా కూడా తన వాయిస్ వినిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఆయన మోకాలి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.
దాంతో ఆయన రెండు నెలలుగా రెస్ట్ తీసుకుంటున్నారు. నవంబర్ లో వశిష్టతో కలిసి మూవీ చేయబోతున్నారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా సరే తన బదులు రామ్ చరణ్ ను పంపిస్తున్నారు. అయితే తాను రెస్ట్ తీసుకోవడంతో పాటు.. రామ్ చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఈ నిర్ణయం తీసుకుంటున్నారంట.
రామ్ చరణ్ ఇమేజ్ బాగా పెరిగిపోతోంది. కాబట్టి ఇప్పటి నుంచే తన స్థానంలో రామ్ చరణ్ ను ఉంచాలని, అందుకే ఇండస్ట్రీకి దగ్గర చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. రామ్ చరణ్ తన తర్వాత ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటున్నారు చిరంజీవి.
అందుకోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొన్న ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకు రామ్ చరణ్ ను పంపడం వెనక రీజన్ కూడా ఇదే అంటున్నారు. ఏదేమైనా చిరంజీవి చేస్తున్న పనుల వల్ల రామ్ చరణ్ కు గొప్ప స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఎలాగూ తండ్రికి తగ్గ వారసుడిగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా తండ్రి తర్వాత తానే అన్నీ అయి ఉంటాడని చెబుతున్నారు.