Chiranjeevi Shocked Mega Fans : సంచలన నిర్ణయం తీసుకున్న చిరు.. మెగా అభిమానులకు షాక్..!

NQ Staff - August 17, 2023 / 09:41 AM IST

Chiranjeevi Shocked Mega Fans : సంచలన నిర్ణయం తీసుకున్న చిరు.. మెగా అభిమానులకు షాక్..!

Chiranjeevi Shocked Mega Fans :

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా హుషారుగా సినిమాలను తీస్తున్నారు. చూడాల్సిన హైట్స్ అన్నీ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే చూసేశారు. చేయాల్సిన సినిమాలన్నీ చేసేశారు. కొట్టాలనుకున్న ఇండస్ట్రీ హిట్లు కొట్టేశారు. చేయాల్సిన ప్రయోగాలన్నీ చేశారు. ఒక నటుడిగా ఆయన కెరీర్ పరిపూర్ణం అనే చెప్పుకోవాలి. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో శరవేగంగా సినిమాలను తీసేస్తున్నారు. ఏదో టైమ్ పాస్ చేసినట్టే అలవోకగా సినిమా షూటింగులు కంప్లీట్ చేసేస్తున్నారు. ఆయనకు పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు గానీ.. ఆయన అభిమానులకు మాత్రం ఆయన సినిమా అంటే ఆకాశమంత ఎత్తులో ఊహించుకుంటారు.

మరి చిరంజీవి కూడా వారి అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి. కానీ రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ ను చిరు ఎలా చేశాడనే విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి ఇలాంటి చెత్త సినిమా ఎలా చేశారు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది చిరంజీవి కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమాగా నిలిచిపోయింది. ఎంతలా అంటే ఏకంగా చిరంజీవి హర్ట్ అయిపోయారంట. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరంజీవి.. ఇంత దారుణమైన విమర్శలు ఏ సినిమా వల్ల ఎదుర్కోలేదు. అందుకే పూర్తి డిసప్పాయింట్ లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.

అందుకే కొన్నాళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారంట. ఈ నిర్ణయంతో తీసుకున్న తర్వాతనే ఆయన మోకాలికి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. రీసెంట్ గానే ఆయన ఢిల్లీకి వెళ్లి ఈ సర్జరీ చేయించుకున్నారు. చిరంజీవి ఇలా సినిమాలకు గ్యాప్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో హిట్లర్ సినిమాకు ముందు ఆయన ఇలా గ్యాప్ తీసుకున్నారు. బిగ్ బాస్, రిక్షావోడు లాంటి భారీ ఫ్లాప్స్ రావడంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. ఇక హిట్లర్ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పుడు భోళా శంకర్ తో దిమ్మ తిరిగే డిజాస్టర్ ఎదురయింది. ఏకంగా చిరంజీవి నటన మీదే విమర్శలు వచ్చే స్థాయిలో సినిమా ఫలితం ఉంది. అందుకే ఆయన ఎన్నడూ లేనంత అసహనంలో ఉన్నారంట. అందుకే ఇప్పుడు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుని, ఆ తర్వాత విదేశాలకు టూర్ కు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కల్యాణ్‌ కృష్ణతో చేయాల్సి ఉంది. మరొకటి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు గ్యాప్ వస్తాయనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే చిరంజవి పుట్టిన రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆయన బర్త్ డే మరో వారంలో వస్తోంది. మరి ఆ రోజు ఏదైనా కొత్త సినిమా అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటిది వస్తే సినిమాలకు గ్యాప్ ఇవ్వరు. అలా కాకుండా సైలెంట్ గా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటే కచ్చితంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us