Chiranjeevi: సీఎం జ‌గ‌న్‌కు చిరు విన‌తి.. పున‌రాలోచ‌న చేసుకోమంటూ ట్వీట్

Chiranjeevi:  ఏపీ అసెంబ్లీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌లు విష‌యాల‌పై మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ నిబంధనలకు లోబడే ఇక నుండి సినిమా టిక్కెట్‌ ధరలు ఉంటాయని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సినిమాస్‌ (రెగ్యులేషన్‌) అమైండ్‌మెంటు బిల్లుా2021ని శాసనసభలో బుధవారం మంత్రి ప్రవేశపెట్టారు.

TheNewsQube-
chiranjeevi request to jagan
chiranjeevi request to jagan

థియేటర్లలో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని చట్టం చెబుతున్నా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడే సినిమా పరిశ్రమ నడుచుకోవాలే తప్ప ఇష్టారాజ్యంగా నడుచే అవకాశం ఇకపై ఉండదన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టిక్కెట్లు థియేటర్లలో బుక్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు.

సినిమా టిక్కెట్లరేట్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ఉపయోగపడుతుందన్నారు. చాలా చోట సినిమా కలెక్షన్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మొత్తాలకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే జిఎస్‌టి పోల్చి చూసినా ఎక్కడా పొంతన కనబడటం లేదన్నారు.

ఆన్‌లైన్‌ సిస్టమ్‌ పెడితే ప్రభుత్వానికి వచ్చే పన్నులు పోర్టల్‌లో తెలుస్తాయని, ప్రజలకు కూడా టిక్కెట్‌ కూడా సరసమైన రేటుకే లభ్యమవుతాయన్నారు. అయితే ఈ నిర్ణ‌యాల‌పై తాజాగా చిరంజీవి వినమ్రంగ స్పందించారు. ప‌రిశ్ర‌మ కోరిన విధంగా పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్ర‌వేశ‌పెట్ట‌డం హ‌ర్షించ‌ద‌గ్గ‌విష‌యం.

అధే విధంగా థియేట‌ర్స్ మ‌నుగ‌డ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బ‌తువు తెరువు కోసం త‌గ్గించిన టికెట్ రేట్స్‌ని కాలానుగుణంగా, స‌ముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల‌లో ఉన్న విధంగా నిర్ణ‌యిస్తే ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంది. దేశ‌మంతా ఒకటే జీఎస్టీ ట్యాక్స్‌లు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న‌ప్పుడు టికెట్ ధ‌ర‌ల‌లో కూడా అదే వెసులు బాటు ఉండ‌డం స‌మంజ‌సం.

chiranjeevi request to jagan2
chiranjeevi request to jagan2

ద‌య‌చేసి ఈ విష‌యంపై పున‌రాలోచించ‌డం. ప్రోత్సాహం ఉన్న‌ప్పుడే తెలుగు ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుగోగ‌లుగుతుంద‌ని చిరు త‌న ట్వీట్‌లో పేర్కోన్నారు.