మెహర్ రమేష్ కు అవకాశం ఇవ్వనున్న మెగాస్టార్, కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్

Advertisement

దర్శకుడు మెహర్ రమేష్ ను తెలుగు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయారు. ఆయన తీసిన చివరి మూవీ కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తు లేదు. బిల్లా మూవీతో ఓ మోస్తరు హిట్ అందుకున్న మెహర్ రమేష్ ఆ తరువాత తీసిన కంత్రి, శక్తి, షాడో వంటి మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవి చూశాయి. మెహర్ రమేష్ అన్ని మూవీస్ కూడా బిగ్ బడ్జెట్ మూవీసే కానీ అన్ని మూవీస్ కూడా బాక్స్ దగ్గర సక్సెస్ ను అందుకోలేకపోయాయి. షాడో మూవీ తరువాత మెహర్ రమేష్ మరే మూవీ కూడా డైరెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మెహర్ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

ఎన్నో అపజయలను చూసిన రమేష్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని నిన్న ఏకంగా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు రమేష్ నిన్న బర్త్ డే విషెస్ చెప్పగా దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ చిరంజీవి అన్నయ్యతో నీవు తీస్తున్న మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. దీన్ని త్వరలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలోచిరు నటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here