Chiranjeevi: మిడ్ నైట్‌లో వ‌కీల్ సాబ్‌ని కాపాడిన చిరంజీవి

Samsthi 2210 - June 9, 2021 / 02:28 PM IST

Chiranjeevi: మిడ్ నైట్‌లో వ‌కీల్ సాబ్‌ని కాపాడిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తా వాదిగా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్నారు. బ్ల‌డ్ దొర‌క్క చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ స్థాపించి అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి విల‌యం వ‌ల‌న ఆక్సిజ‌న్ దొర‌క్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిస్థితి పున‌రావృతం కాకూడ‌ద‌ని భావించిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల‌లో సొంత ఖర్చులతో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అభిమాన సంఘాల ద్వారా 24/7 ఉచితంగా వాటిని కరోనా రోగులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహా యజ్ఞం కోసం ఏకంగా 30కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది.

చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్ ద్వారా ఎంద‌రో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఏం సాయం ఆశించ‌కుండా చిరు చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌జ‌లు కొనియాడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయితే తాజ‌గా రాజాం పాత్రంలో ఓ న్యాయ‌వాదికి కరోనా సోకింది. మిడ్ నైట్‌లో అత‌నికి అర్జెంట్‌గా ఆక్సిజ‌న్ అవ‌సరం అయింది.అప్ప‌టికే ఓ సిలిండ‌ర్ అయిపోగా, దానిని రీప్లేస్ చేయించేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించారట. అంత అర్ధ‌రాత్రి కూడా ట్ర‌స్ట్ సేవికులు ఆక్సిజన్ సిలిండర్ ని హుటాహుటీన అందించి మానవతను చాటుకున్నారు. ప్రాణం పోసిన చిరంజీవి ట్రస్ట్ పై లాయర్ బంధుమిత్రులు కుటుంబీకులు ప్రశంసలు కురిపించారు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ్రీకాకుళం- రాజాం పరిసరాల్లో చిరంజీవి ట్రస్ట్ పాపులారిటీ అమాంతం పెరిగింది. అంద‌రు ఇదే విష‌యం గురించి చ‌ర్చించుకుంటున్నారు.మెగా సేవ వ‌ల‌న ఎంద‌రో ప్రాణాలు నిలుస్తున్నాయి అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. రీసెంట్‌గా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌పై సోనూసూద్ కూడా ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us