ప్లాప్ డైరెక్టర్ కు చిరు ఎందుకు అవకాశం ఇచ్చారు?

Admin - September 25, 2020 / 10:28 AM IST

ప్లాప్ డైరెక్టర్ కు చిరు ఎందుకు అవకాశం ఇచ్చారు?

ఆచార్య మూవీలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి యొక్క తదుపరి చిత్రంపై ఇప్పుడే ఇండస్ట్రీ పెద్ద చర్చ జరుగుతుంది. ఆచార్య మూవీ తరువాత మలయాళం మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వేదాళం మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే భాధ్యతను డైరెక్టర్ మెహర్ రమేష్ కు ఇచ్చారు. ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ కు అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆశ్చర్యపోయాయి .

ఒక డైరెక్టర్ గా మెహర్ రమేష్ ఇచ్చిన శక్తి, కంత్రి, షాడో ప్లాప్స్ ను ఇండస్ట్రీ ఎప్పటికి మర్చిపోదు. ఆ ప్లాప్స్ వల్ల ఆ మూవీస్ చేసిన హీరోస్ షేడ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఘోరమైన ప్లాప్స్ ఇచ్చిన రమేష్ కు ఎందుకు ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మెహర్ రమేష్ కు చిరంజీవి కుటుంబంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే కరోనా టైమ్స్ లో సీసీసీ సరుకుల పంపిణీలో కూడా రమేష్ చాలా చురుగ్గా పాల్గొని చిరుకు అండగా నిలిచారు. ఈ కారణం వల్లే చిరు మెహర్ కు అవకాశం ఇచ్చారని సమాచారం. అలాగే వేదాళం రీమేక్ లో మెహర్ చేసి న మార్పులు కూడా చిరుకు నచ్చడం కూడా ఒక కారణం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us