Chiranjeevi : చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అంటున్న నాగ్, బాలయ్య. ఇలా హింట్ ఇచ్చారా..?
NQ Staff - December 31, 2023 / 01:26 PM IST
Chiranjeevi :
చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఓ వాదన జరుగుతోంది. ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలనేది అందరి ప్రశ్న. అయితే దానికి ఒకప్పుడు దాసరి నారాయణ రావు ఆన్సర్ గా ఉండేవారు. ఎందుకంటే ఇండస్ట్రీకి అన్నీ ఆయనే దగ్గరుండి మరీ చూసుకునేవారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ స్థానం ఎవరికి ఇవ్వాలనే ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి. కొన్ని రోజులు మెగాస్టార్ చిరంజీవి ఆ బాధ్యతలు తీసుకున్నట్టు కనిపించారు. కానీ ఆయన ఎక్కడా కూడా తానే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ ఇండస్ట్రీకి ఏ అవసరం వచ్చినా సరే ముందుండి పరిష్కరించారు.
అయితే కొందరు ఆయన్ను ఇండస్ట్రీ పెద్ద కాదంటూ వాదించేసరికి ఆయన కాస్త హర్ట్ అయ్యారు. అప్పటి నుంచి తాను ఇండస్ట్రీ పెద్ద కాదని చిరంజీవి స్వయంగా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే మాత్రం ముందుండి పరిష్కరిస్తున్నారు. ఆ మధ్య ఏపీ గవర్నమెంట్ టికెట్ల రేట్లను తగ్గిస్తే చిరంజీవి స్వయంగా ముందుండి మరీ ఆ సమస్యను పరిష్కరించారు. హీరోలు, దర్శకులను తీసుకెళ్లి మరీ జగన్ తో సమావేశం అయ్యారు. టికెట్ల రేట్లను తిరిగి పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అప్పుడు రాజమౌళి లాంటి వారు స్వయంగా చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అని ప్రకటించారు.
కానీ చిరంజీవి మాత్రం ఆ బాధ్యతలు తాను తీసుకోలేనంటూ చెబుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పరిగిన పరిణామాలతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అని అందరూ చెబుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన్ను ఇండస్ట్రీ నుంచి పదిహేను రోజుల వరకు ఎవరూ కలవలేదు. కానీ మొదటి సారిగా చిరంజీవి వెళ్లి కలిశారు. ఆ తర్వాతనే రీసెంట్ గా బాలకృష్ణ వెళ్లారు. నిన్న నాగార్జున కూడా వెళ్లి సతీసమేతంగా కలిసి వచ్చారు. ఇలా పెద్ద హీరోలందరు చిరంజీవి తర్వాతనే కలుస్తున్నారు. అంతే గానీ చిరంజీవి కంటే ముందు మాత్రం కలవట్లేదు.
మరి ఇలా చిరంజీవి కంటే తర్వాతనే ఎందుకు కలిశారనే ప్రశ్నలు అందరిలోనూ వస్తుంటాయి. దానికి కూడా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చిరంజీవి వెళ్లి కలిసేంత వరకు తాము కలవొద్దని బాలయ్య, నాగార్జున, ఇతర నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు నిర్నయించుకున్నారు కాబోలు.
అందుకే చిరంజీవి కాస్త లేటుగా కలిసినా సరే.. ఆయన కలిసే దాకా అందరూ వెయిట్ చేశారు. అంటే దీన్ని బట్టి చిరంజీవినే ఇండస్ట్రీ పెద్ద అని బాలయ్య, నాగార్జున ఒప్పేసుకుంటున్నారని అర్థం అవుతోంది. కాబట్టి ఇప్పట్లో చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీ పెద్దగా ఉంటాడు తప్ప.. ఆయన స్థానంలోకి ఇంకెవరూ రాలేరని అర్థం అవుతోందన్నమాట.