Chiranjeevi : ఇకపై పద్మవిభూషన్ చిరంజీవి.. ఈ సందర్భంగా ఆయన కెరీర్ పై లుక్కేద్దాం..!

NQ Staff - January 26, 2024 / 09:54 AM IST

Chiranjeevi : ఇకపై పద్మవిభూషన్ చిరంజీవి.. ఈ సందర్భంగా ఆయన కెరీర్ పై లుక్కేద్దాం..!

Chiranjeevi :

మెగాస్టార్ చిరంజీవి మరో మెట్టు ఎక్కారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డును ప్రకటించింది. నిన్న రాత్రి 2024 పద్మ అవార్డునుల ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ తో పాటు 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇక పద్మ విభూషన్ అవార్డు అందుకున్న వారిలో తెలుగు నుంచి చిరంజీవి ఉన్నారు. దాంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాంతో ఇక నుంచి పద్మ శ్రీ చిరంజీవి కాస్త పద్మ విభూషన్ చిరంజీవి అయిపోయారు.

ఇప్పటి వరకు తెలుగు నుంచి అతికొద్ది మందికి మాత్రమే పద్మ విభూషన్ అవార్డు దక్కింది. ఇందులో చిరంజీవి కూడా ఒకరు కావడం ఆయన అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఆయన తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలారు. అంచెలంచెలుగా ఎదిగి చివరకు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా అవతరించారు. చిరంజీవి తర్వాత కూడా ఎంతో మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి పుట్టుకొచ్చారు. వారు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.

చిరంజీవి మొదటి నుంచి స్టార్ హీరోగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన సొంతంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు, చిరంజీవి ఐ బ్యాంకులను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వాటితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంతే కాకుండా కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. దాంతో పాటు ఎంతో మందికి వైద్య చికిత్స కోసం సేవలు అందించారు చిరంజీవి. ఇలా అనేక రకాలుగా ఈ సమాజానికి ఆయన సేవలు అందించారు. అందుకే ఆయనను ఇప్పుడు పద్మ విభూషన్ అవార్డు వరించింది.

చిరంజీవికి దీనికంటే ముందే 2006లో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు చిరంజీవి. ఇక తనకు పద్మ విభూషన్ అవార్డు రావడంతో చిరంజీవి కూడా ఎమోషనల్ అయ్యారు.

తనకు బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ఆయనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తెలుగులో ఏఎన్నార్ తర్వాత పద్మ విభూషన్ అవార్డు అందుకున్నాడు చిరంజీవి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us