Chiranjeevi: చిరంజీవి అంబులెన్స్ స‌ర్వీస్ .. త్వ‌ర‌లోనే శ్రీకారం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి న‌టుడిగానే కాదు మంచి మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషిగా ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌తో ఎందరో ప్రాణాలు కాపాడిన చిరంజీవి క‌రోనా క‌ష్ట కాలంలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. 24 గంట‌లు ప‌ని చేస్తున్న ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్ ద్వారా ఎంద‌రో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఆక్సిజ‌న్ బ్యాంక్ కోసం చిరంజీవి 30 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్. ఇక చిరు రీసెంట్‌గా సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ కూడా ఆరంభించారు.

అనేక సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌లో గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న చిరంజీవి ఇప్పుడు అంబులెన్స్ స‌ర్వీస్ కూడా ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. రానున్న రోజుల‌లో తెలుగు రాష్ట్రాల అంత‌టా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను కూడా మొదలు పెట్టి పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని భావిస్తున్నారు చిరు. అయితే ఇది ప్రస్తుతానికి అధికారికం కాకపోయినా ప్రకటన రావొచ్చేమో అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. గ‌తంలో ప్ర‌జా రాజ్యం పెట్టి రాజ‌కీయాల‌లోకి వెళ్లిన చిరంజీవి ఇప్పుడు తిరిగి రాజ‌కీయారంగేట్రం చేయ‌బోతున్నారా, వ‌రుస‌గా చేస్తున్న ఈ సేవా కార్య‌క్ర‌మాలు చూస్తుంటే అంద‌రికి అదే ఆలోచ‌న క‌లుగుతుంది.

ప్ర‌స్తుతం చిరు ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 152వ సినిమా పై మెగా అభిమానులలో రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మెగాఫాదర్ సన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కేవలం 15రోజులు మాత్రమే బాలన్స్ ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రాంచరణ్ జోడిగా కనిపించనుంది. ఇక మెగాస్టార్ జోడిగా రెండోసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది.