ట్రైన్ లో శోభనం.. మర్చిపోలేని అనుభూతి: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానం. ఆయనకు అభిమానులు కూడా ఎక్కువే. మెగాస్టార్ గురించి ఏ చిన్న అప్డేట్ తెలిసిన గాని అది అభిమానులకు పండగే. ఎందుకంటే మొదటి నుంచి చిరంజీవి తన కాళ్ళ మీద తాను ఎదిగిన వ్యక్తి. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా అయన స్వయంగా ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శం. చిరంజీవి హీరోగా సెటిల్ అవుతున్న సమయంలోనే అల్లు రామలింగయ్య తన చిన్న కుమార్తె అయిన సురేఖని ఇచ్చి వివాహం జరిపించాడు.1980 వ సంవత్సరం ఫిబ్రవరి 20 న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. అయితే చిరంజీవి తనకు పెళ్లి అయిన మరుసటి రోజే సురేఖ ను ఒంటరిగా వదిలేసి షూటింగ్ కి వెళ్లారట. అప్పట్లో చెన్నై లో అల్లు రామ లింగయ్య నివాసం ఉండేది.అయితే అప్పటికే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది.

chiranjeevi first night

చిరంజీవికి పెళ్లయిన తర్వాత అత్తగారింటి ఆచారాలు పూర్తి చేసుకోవడానికి హైదరాబాద్ లో షూటింగ్ చేసి భార్య సురేఖను మద్రాసు తీసుకుని వెళ్లాలని అనుకున్నారట చిరంజీవి.అలా ప్రయాణానికి అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నారట. పెళ్లి అయిన తరువాత ట్రైన్ లో మొదటి రాత్రి హైదరాబాద్ నుండి మద్రాసుకు వెళ్లాల్సి ఉంది. అలాగే ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారట. అయితే ట్రైన్ ఎక్కి వాళ్ళ బోగి దగ్గరకు వెళ్ళాక ఆ దంపతులకు అనుకోని షాక్ కి గురయ్యారట. అక్కడ అసలు ఏమి జరిగిందంటే వారు ఎక్కినా ఫస్ట్ క్లాస్ బోగిలో మొదటి రాత్రి సెటప్ చేసి ఉందట.అంతే అది చూసి వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాము ఏమైనా పొరపాటుగా ఎక్కామా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారట. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారితో కూడా ఎంక్వయిరీ చేశారట. అప్పుడు అస్సలు విషయం వారు చెప్పడంతో దిగ్బ్రాంతికి గురయ్యాడట చిరంజీవి. ఆ ఏర్పాట్లు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేయించారని తెలుసుకున్నారట చిరంజీవి దంపతులు.  చిరంజీవి దంపతులు మద్రాసు వెళ్తున్న విషయం తెలుసుకుని రాఘవేంద్రరావు ట్రైన్ లో ఫస్ట్ నైట్ సెట్ అప్ ఏర్పాటు చేయించారట. అచ్చం సినిమాలో లాగానే పూలు, పండ్లు, స్వీట్స్ పెట్టి ఎలా ఫస్ట్ నైట్ సెట్ వేస్తారో అలానే ట్రైన్ లో కూడా అలానే ఒక్క ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారట.

ఈ విషయాన్ని ఇప్పటిదాకా చిరంజీవి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ రాఘవేంద్ర రావుకి జాతీయ పురస్కారం వచ్చిన నేపథ్యంలో చిరంజీవి స్టేజి పైన చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తేసారు. ఇలా తన జీవితంలో ట్రైన్ లో జరిగిన ఫస్ట్ నైట్ ను నేనెప్పుడూ మర్చిపోలేనని చిరంజీవి చెప్పారు.. !! అలాగే ఇంత మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావును కూడా ఎప్పుడు తలచుకుంటానాని చెప్పారు.. !!

Advertisement
Advertisement