పేదలకు ఉచితంగా ప్లాస్మా : చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌

Admin - September 29, 2020 / 12:25 PM IST

పేదలకు ఉచితంగా ప్లాస్మా : చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌

కరోనా నుండి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాలనీ సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగా స్టార్ చిరంజీవి పేదలకు ఆపన్న హస్తంగా నిలవాలని ఓ నిర్ణయం తీసుకున్నాడు. పేదలకు కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిద్ధమైంది. కరోనా సోకి కోలుకున్న వారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి జీవితం ఇచ్చినట్లే.

ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా దానం చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. అయితే తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ఫ్లాస్మా సరఫరా చేస్తోంది.నీరు పేదలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మెగాస్టార్ కోరారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us